Dilruba: కిరణ్ అబ్బవరం మూవీ సంక్రాంతి పోస్టర్ చూశారా..
ABN , Publish Date - Jan 14 , 2025 | 04:27 PM
‘క’ మూవీతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఈ వాలెంటేన్స్ డేకి మరో మెమరబుల్ మూవీతో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘దిల్ రూబా’ పేరుతో రానున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు.
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’. కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘దిల్ రూబా’ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Also Read- Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
ఈ రోజు (మంగళవారం) మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘దిల్ రూబా’ సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్‌లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ‘దిల్ రూబా’ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్ర రిలీజ్ హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డేకి ఈ ‘దిల్ రూబా’ రిలీజ్ మరింత స్పెషల్ కానుంది.
హీరో కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. వరుస పరాజయాల తర్వాత సాలిగ్ హిట్‌ని ‘క’ సినిమాతో అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన వైబ్‌తో ఆయన చేస్తున్న ఈ ‘దిల్ రూబా’పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. చూద్దాం.. కిరణ్ అబ్బవరాన్ని ఆయన ‘దిల్ రూబా’ ఏం చేస్తుందో..