Keerthy Suresh: పెళ్ళైనా తగ్గేదే లే అంటున్న కీర్తి

ABN , Publish Date - Mar 27 , 2025 | 06:55 PM

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తహతహలాడుతోంది. అందులోనూ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కు అమ్మడు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

'మహానటి' (Mahanati) సినిమాతో ఫుల్ పాపులర్ అయిన కీర్తీ సురేశ్ (Keerthy Suresh) సినిమాల విషయంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజీ లైనప్ ను సెట్ చేసుకుంటోంది. పెళ్లి తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దూసుకుపోతోందీ టాలెంటెడ్ బ్యూటీ. అంతేకాక హోమ్లీ లుక్ ను మార్చేసి... ఫుల్ హాట్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ 'బేబీ జాన్' (Baby John) లో బ్యూటీ గ్లామర్ ట్రీట్ కు నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. బట్ ఆమె ఆశించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. అయినా... హాట్ ట్రీట్ తో పాటు కమర్షియల్ సినిమాల్లో అలరించేందుకు రెడీ అవుతోంది కీర్తి సురేశ్‌. తాజాగా ఓ క్రేజీ ఆఫర్ ఈ మల్లూవుడ్ భామ కొట్టేసినట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది.


మొన్నటి వరకు సినిమాల రేస్ లో కాస్త వెనకబడ్డ ఈ బ్యూటీ.... మళ్లీ పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది. గతంలో లాగా సినిమాల ఎంపికలో తడబడకుండా... సెలెక్టివ్ గా ఎంపిక చేసుకుంటోంది. నార్త్, సౌత్ అని తేడా లేకుండా నాలుగైదు సినిమాలను బ్యూటీ తన కిట్టిలో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీ టౌన్ లో గ్లామర్ డోస్ తో ఆకట్టుకున్న బ్యూటీ... రాకింగ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbeer Kapoor) తో నటించే ఛాన్స్ ను కొట్టేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో పలకరించనున్నట్లు బాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే రణబీర్ ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ''రామాయణం, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్'' వంటి సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఈ టైంలో కీర్తి సురేశ్‌ తో మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇటు సౌత్ లోనూ కీర్తి క్రేజీ ప్రాజెక్టులను కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది.


యూత్ స్టార్ నితిన్ (Nithin), వేణు యెల్దండీ కాంబినేషన్‌లో రానున్న 'ఎల్లమ్మ'లో సాయి పల్లవి (Sai Pallavi) స్థానంలోకి కీర్తి సురేశ్‌ వస్తోందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. 'ఎల్లమ్మ' నిర్మాత దిల్ రాజే... విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దర్శకుడు రవికిరణ్ కోల కాంబోలో 'రౌడీ జనార్దన్' అనే మూవీ తీయబోతున్నాడు. ఇందులోనూ కీర్తి సురేశ్‌ హీరోయిన్ అని అంటున్నారు. ఇక సుహాస్‌తో చేస్తున్న 'ఉప్పు కప్పురంబు' మూవీ అప్ డేట్ రావాల్సి ఉంది. అలానే అమ్మడు చేసిన యాక్షన్ మూవీ 'రివాల్వర్ రీటా' విడుదలకు రెడీగా ఉంది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ ఇక మీదట కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడానికి తహతహలాడుతోంది. ఇప్పుడు కమిట్ అయ్యే సినిమాల్లో ఏ ఒక్కటి రెండు సూపర్ హిట్ అయినా... ఆమె కెరీర్ కు మరో రెండు మూడేళ్ళ పాటు ఢోకా ఉండదు. సహజంగా పెళ్ళి చేసుకున్న హీరోయిన్లను జనాలు ఆదరించరనే మాటలు సినిమా రంగంలో వినిపిస్తుంటాయి. అందులో వాస్తవం లేదని కూడా కొందరు స్టార్ హీరోయిన్లు ఇప్పటికే నిరూపించారు. మరి కీర్తి సురేశ్ కూడా ఆ జాబితాలో చేరుతుందో లేదో చూద్దాం.

Also Read: Shruti Haasan: ఎవరు ఊరికే గొప్పవారు కారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 27 , 2025 | 11:10 PM