కన్నప్ప విడుదల వాయిదా
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:26 AM
మంచు విష్ణు కీలక పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ముందు ప్రకటించిన విధంగా...
మంచు విష్ణు కీలక పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ముందు ప్రకటించిన విధంగా ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మంచు విష్ణు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వీఎ్‌ఫఎక్స్ పనులు పూర్తి కానందున సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేస్తున్నందుకు అభిమానులకు విష్ణు క్షమాపణలు చెప్పారు. మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.