ఈ స్థాయి విజయం ఊహించలేదు
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:40 AM
తన తొలి చిత్రం ‘మ్యాడ్’తో దర్శకుడిగా సూపర్‌హిట్ అందుకున్నారు కల్యాణ్ శంకర్. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘మ్యాడ్ స్క్వేర్’ను నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో...
తన తొలి చిత్రం ‘మ్యాడ్’తో దర్శకుడిగా సూపర్‌హిట్ అందుకున్నారు కల్యాణ్ శంకర్. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘మ్యాడ్ స్క్వేర్’ను నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణతో భారీ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు దర్శకుడు కల్యాణ్. ‘‘మొదటి భాగం యువతకు ఎక్కువ చేరువైంది. కానీ రెండో భాగం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ చేరువవ్వడం ఆనందంగా ఉంది. సినిమాకు మంచి స్పందన వస్తుందని ఊహించాం. కానీ, ఈ స్థాయి విజయం అందుకుంటుందని అస్సలు ఊహించలేదు. ఈ సినిమాలో కథ ఉండదు.. కేవలం వినోదం మాత్రమే ఉంటుంది అని ప్రేక్షకులను ముందుగానే సిద్ధం చేయడం కలిసొచ్చింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్‌నితిన్, విష్ణుల నటన, వినోదం, భీమ్స్ సిసిరోలియో సంగీతం, నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి. ఈ విజయం ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు అంకితం’’ అని చెప్పారు.