ఎన్టీఆర్ అడుగుపెడుతున్నారు
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:41 AM
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూట్ ఇటీవలె ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా...
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూట్ ఇటీవలె ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ‘‘ఎన్టీఆర్-నీల్ సినిమా కీలక షెడ్యూల్‌కు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి సినిమా సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెడుతున్నారు’’ అని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 9న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయిక. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.