పురాణ నేపథ్యంలో

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:15 AM

ప్రస్లుతం మైథలాజికల్‌ టచ్‌ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఆ తరహా చిత్రాల నిర్మాణం ఎక్కువైంది. ఇటువంటి నేపథ్యంలో జగదీశ్‌ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో..

ప్రస్లుతం మైథలాజికల్‌ టచ్‌ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఆ తరహా చిత్రాల నిర్మాణం ఎక్కువైంది. ఇటువంటి నేపథ్యంలో జగదీశ్‌ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యముడు’. ధర్మో రక్షితి రక్షితః అనేది ఉప శీర్షిక. ఇందులో శ్రావణి శెట్టి కథానాయిక. ఈ మూవీకి చెందిన పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో యుముడి గెట్‌పలో జగదీశ్‌ కనిపించారు. ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ చిత్రానికి రచన: హరి అల్లసాని, జగదీశ్‌ ఆమంచి, సంగీతం: భవానీ రాకేశ్‌, డీఓపీ: విష్ణురెడ్డి వంగా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రజని ఆమంచి.

Updated Date - Apr 27 , 2025 | 01:15 AM