Jaat Release Date: హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Jan 24 , 2025 | 03:24 PM

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘జాట్’. ఇటీవల వచ్చిన టీజర్‌తోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్ర విడుదల తేదీని శుక్రవారం మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘జాట్’ విడుదల ఎప్పుడంటే..

Jaat Movie Still

బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘జాట్’. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ విధ్వంసం సృష్టిస్తోంది.


Also Read-Fake Collections: అంతా ఫేకే.. అందుకే ఐటీ దాడులు

‘జాట్’ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ఇంటెన్స్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. భుజంపై భారీ తుపాకీతో ఫెరోషియస్‌గా ముందుకు దూసుకెళుతున్నారు. బ్యాక్ డ్రాప్‌లో హెలికాప్టర్, కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతున్నాయి. సన్నీ డియోల్‌ను ఈ పోస్టర్‌లో ప్రజంట్ చేసిన తీరు సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాను 10 ఏప్రిల్, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 10కి కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్నందున.. మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌ని వినూత్నంగా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.


Also Read- Gandhi Tatha Chettu Review: సుకుమార్‌ కుమార్తె నటించిన సినిమా ఎలా ఉందంటే

ఇంతకు ముందు టీజర్ విషయంలో కూడా మేకర్స్ పక్కా ప్లాన్‌తో విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో విడుదలై సంచలనాలను సృష్టించిన ‘పుష్ప 2’ మూవీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ టీజర్‌ను 12,500 స్క్రీన్లలో ప్రదర్శించగా.. ఈ టీజర్ 2025 మోస్ట్ బ్లాస్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచే స్టేజ్‌ని ఈ సినిమాకు సెట్ చేసింది. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కాసాండ్రా వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‪కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 03:24 PM