ఓ రామ శ్రీరామ..
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:32 AM
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాట్’. సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా హీరోయిన్లు...
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాట్’. సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థియేటర్లలో ఈనెల 10న విడుదలవుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘ఓ రామా శ్రీరామ..’ అనే పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు థమన్ స్వరాలు అందించగా, ధనుంజయ్ ఆలపించారు.