వేసవి బరిలో...
ABN , Publish Date - Jan 08 , 2025 | 02:50 AM
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు...
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో అజిత్ సాల్డ్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్ సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అజిత్‌కు తప్పిన ప్రమాదం
అజిత్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. రేసింగ్ అంటే అమితాసక్తి చూపే ఆయన.. దుబాయ్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న ‘24హెచ్’ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఇందుకోసం అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాక్ గోడను ఢీకొంది. ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయనను వేరే కారులోకి తరలించారు. అజిత్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. కాగా, అజిత్ నటించిన ‘విడాముయర్చి’ చిత్రం సంక్రాంతికి విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదాపడింది.
- చెన్నై (ఆంధ్రజ్యోతి)