Venkatesh: నేను హీరోలా కాకుండా ప్రొడ్యూసర్‌లా ఆలోచిస్తాను

ABN , Publish Date - Jan 12 , 2025 | 02:53 PM

నేను హీరోలా కాకుండా ప్రొడ్యూసర్‌లా ఆలోచిస్తానని అన్నారు విక్టరీ వెంకటేష్. ఆయన హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై బ్లాక్‌బస్టర్ వైబ్ క్రియేట్ చేయడంతో.. మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో మ్యూజికల్ నైట్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకీమామ మాట్లాడుతూ..

SankrantiKi Vasthunnam Event

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. విడుదలకు ముందే ఈ సినిమా సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలతో పెద్ద సక్సెస్ వైబ్‌ని తీసుకొచ్చిన క్రమంలో.. శనివారం మేకర్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ ఈవెంట్‌ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ లైవ్ లో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ పాడటం అందరినీ ఉర్రూతలూగించింది.


Also Read-Daaku Maharaaj: అయ్యబాబోయ్.. ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ టాక్ ఇలా ఉందేంటి?

ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రతి సినిమాకు హీరోలా కాకుండా ప్రొడ్యూసర్‌లా ఆలోచిస్తాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్యూ. ఇది వండర్ ఫుల్ జర్నీ. ఇది నా 76వ సినిమా. ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న వస్తోంది. అనిల్ వండర్ ఫుల్ స్క్రిప్ట్‌తో వచ్చారు. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు.


నా అభిమానులు ఇలాంటి సినిమాలని చాలా ఇష్టపడతారు. వాళ్ళ ప్రేమ ఎప్పుడూ చూపిస్తూనే వున్నారు. మళ్ళీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం. మీరంతా ఫ్యామిలీతో రావాలి. మామూలుగా వుండదు చాలా ఎంజాయ్ చేస్తారు. అనిల్ ప్రతి సీన్ అద్భుతంగా తీశాడు. చాలా ఎంటర్‌టైన్మెంట్, నవ్వులు వుంటాయి. సినిమాని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకు థాంక్యూ. వారి నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఐశ్వర్య, మీనాక్షి చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. దిల్ రాజుగారు నాకు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read- Brahmanandam: హాస్య'బ్రహ్మ'పై దాడి


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 02:53 PM