Game Changer: ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ? స్పెషల్ గెస్ట్ ఎవరంటే?

ABN , Publish Date - Jan 01 , 2025 | 08:48 PM

మెగాభిమానులు, ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదల వివరాలు వచ్చేశాయి. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ, విశిష్ట అతిథి ఎవరనే డిటైల్స్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Game Changer Movie Still

సంక్రాంతి స్పెషల్‌గా రాబోతోన్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్ విడుదల వివరాలు వచ్చేశాయి. ఎప్పుడెప్పుడు ట్రైలర్ విడుదల చేస్తారా? అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య ఓ అభిమాని అయితే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రైలర్ ఎప్పుడు, ఎక్కడ విడుదల చేస్తున్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరు? అనే డిటైల్స్‌లోకి వెళితే..

Also Read- Game Changer: ‘గేమ్ చేంజ‌ర్‌’ సెన్సార్ పూర్తి.. సర్టిఫికేట్ ఏం వచ్చిందో తెలుసా..


గురువారం, జనవరి 2వ తేదీన ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్‌ను మీడియా సమక్షంలో హైదరాబాద్ AMB మాల్‌లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. AMB మాల్‌లో విడుదల చేసే సమయానికే మూడు భాషల్లోనూ యూట్యూబ్ ఛానల్స్‌లో అధికారికంగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండటం విశేషం.


SS-Rajamouli.jpg

సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ అప్డేట్‌తో పాటు.. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుండి ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఈ సినిమాలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Also Read-కాశీ యాత్రలో రేణు దేశాయ్, అకీరా, ఆద్య.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్

Also Read-Prabhas: తెలంగాణ ప్రభుత్వానికి రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్

Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2025 | 08:48 PM