Megastar: చిరంజీవికి ముద్దులతో స్వాగతం!
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:02 AM
మెగా స్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్ డమ్ లో ఘన స్వాగతం లభించింది. 19వ తేదీ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును అందుకోబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మార్చి 19న యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ (House of Commons) నుండి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు (Lifetime Achievement Award) అందుకోబోతున్నారు. ఇందుకోసం గానూ ఆయన యు.కె.కు వెళ్ళారు. అక్కడి తెలుగువారు, ప్రత్యేకించి మెగాభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లో ప్లకార్డులు, వినైల్ బ్యానర్స్ పట్టుకుని స్వాగతించారు. కొందరు అభిమానులైతే జయజయ ధ్వానాలు చేశారు. మరికొందరు తమ మనసులోని ప్రేమను, ఆప్యాయతను ముద్దుల రూపంలో చూపించారు. వీరందరి అభిమానానికి చిరంజీవి తడిసి ముద్దయిపోయారు. వారికి వినమ్రంగా ధన్యవాదాలు తెలిపారు.
గత కొద్ది రోజులుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవికి పలు వేదికలపై ఘన సత్కారాలు జరుగుతున్నాయి. గత యేడాది ఆయన భారత ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్ (Padma Vibhushan) పురస్కారం పొందారు. అలానే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. అక్కినేని జాతీయ పురస్కారం పొందారు. తాజాగా యు.కె. నుండి పొందబోతున్న పురస్కారం ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా మారబోతోంది.
Also Read: Grok: గ్రోక్ ను ఆశ్రయించిన కుర్ర హీరోలు!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి