Gopichand New Movie: కొత్త దర్శకుడితో గోపీచంద్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:09 AM

గోపీచంద్‌ నటిస్తున్న కొత్త సినిమాకు సాయి కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి దినేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు

గోపీచంద్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా గోపీచంద్‌ హీరోగా నటించబోతున్న మరో చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. సాయి కుమార్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేశ్‌ హీరోయిన్‌. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్‌ త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 05:11 AM