Jaabilamma Neeku Antha Kopama: ‘గోల్డెన్ స్పారో’ లిరికల్ సాంగ్
ABN , Publish Date - Feb 01 , 2025 | 09:33 PM
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘గోల్డెన్ స్పారో’ని మేకర్స్ విడుదల చేశారు.
హీరో ధనుష్ తన మల్టీటాలెంట్‌తో సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. హీరోగా ఇప్పుడు ధనుష్ ఎంత బిజీగా ఉన్నా కూడా దర్శకత్వం సైతం వహిస్తున్నారు. ‘పా పాండి, రాయన్’ తర్వాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాతో దర్శకుడిగా ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్‌తో పాటు 21 ఫిబ్రవరి, 2025న తెలుగులోనూ విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో మేకర్లు ప్రమోషనల్ కార్యక్రమాల్ని పెంచేశారు. తమిళంలో ఆల్రెడీ ‘గోల్డెన్ స్పారో’ అనే పెప్పీ సాంగ్ సెన్సేషనల్‌గా మారిన సంగతి తెలిసిందే. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.ఇక ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు.