ఘంటసాల రవికుమార్ కన్నుమూత
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:37 AM
దివంగత దిగ్గజ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రవికుమార్ (72) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం...
దివంగత దిగ్గజ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రవికుమార్ (72) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం కార్డియాక్ అరె్‌స్టకు గురయ్యారు. ఆ వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్లు నిర్థారించారని ఆయన ఏకైక కుమారుడు మొహీందర్ ఘంటసాల ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఘంటసాల రవికుమార్ సౌండ్ రికార్డిస్టుగా ఉన్నారు. దూరదర్శన్‌తో పాటు సన్ టీవీ, జయా టీవీల్లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేశారు. కాగా, తన కుటుంబ సభ్యులు విదేశాల నుంచి నగరానికి రావాల్సి ఉందని, అందువల్ల అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని మొహీందర్ వెల్లడించారు. ఘంటసాల రెండవ భార్య కుమారుడే రవికుమార్.
చెన్నై (ఆంధ్రజ్యోతి)