Payal Rajput: సమంత ‘లచ్చిమి’.. మరి పాయల్ రాజ్‌పుత్..?
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:59 PM
పాయల్ రాజ్‌పుత్ పేరు వినబడితే చాలా గుర్తొచ్చే పేరు ‘ఆర్ఎక్స్ 100’. ఈ సినిమా ఆమె కెరీర్‌లో సంచలనాలను సృష్టించిన సినిమాగా నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ ‘మంగళవారం’ సినిమాతో అలాంటి వైబే కనిపించింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో పాయల్ ప్రేక్షకులను పలకరించపోతుంది. ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పేరు ఏంటి? ఎన్ని భాషల్లో తెరకెక్కబోతోంది? వంటి వివరాల్లోకి వెళితే..
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారింది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా తర్వాత అదే తరహా పాత్రలు కొన్ని చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఇటీవల ‘మంగళవారం’తో మరోసారి మంచి బ్రేక్ అందుకుంది. ఆ సినిమా తర్వాత డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లుంది.. ఓ పవర్ ఫుల్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పాయల్ రెడీ అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో 6 భాషల్లో తెరకెక్కబోతోన్న చిత్రాన్ని శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. డైరెక్టర్ ముని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వెంకటలచ్చిమి’ (Venkatalachimi) అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
Also Read- Jaat Release Date: హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఇంతకు ‘రంగస్థలం’ సినిమాలో సమంత లచ్చిమిగా కనిపించి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ ‘వెంకటలచ్చిమి’గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీని ఎంచుకుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి సక్సెస్‌ని ఇస్తుందో తెలియదు కానీ.. ఈ సినిమా ప్రకటనతోనే మంచి ఆసక్తిని రేకెత్తించింది. రాజా, ఎన్ఎస్ చౌదరి ఈ చిత్ర వివరాలను పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
‘‘ఈ ‘వెంకటలచ్చిమి’ కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) పర్ఫెక్ట్‌గా సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందనే నమ్మకముంది’’ అని అంటే.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. ఏదీ నచ్చక అన్నీ రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని ఈ ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అనేంత గొప్ప సబ్జెక్టు ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకముందని అన్నారు.