ఈ సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నా
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:06 AM
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించారు. ఈనెల 28న థియేటర్లలో విడుదలవుతోంది...
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించారు. ఈనెల 28న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు. హీరో నితిన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. శ్రీలీలతో నాకు ఇది రెండో చిత్రం. మా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే పేరు వస్తుంది’ అని అన్నారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ ‘నేను అనుకోకుండా చేసిన ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చింది’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘డేవిడ్ వార్నర్ క్యారెక్టర్‌లో చాలా సర్‌ప్రైజ్ ఉంటుంది.
మార్చి 28న మీ అందరినీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తాం’ అని అన్నారు. నిర్మాత వై.రవి శంకర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నవ్వులతోపాటు మంచి కథ కూడా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ పక్కా’ అని చెప్పారు. మరో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా కుటుంబ వినోదాత్మక చిత్రం. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయవచ్చు’ అని అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మైత్రీ మూవీస్ నా సొంత సంస్థలాంటిది. దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నితిన్‌కు నెక్స్ట్ లెవెల్ విజయం ఇచ్చే చిత్రమిది. చాలా ప్రేమతో తీసిన ఈ చిత్రాన్ని ఆదరించండి’ అని కోరారు. కేతిక శర్మ మాట్లాడుతూ ‘అదిదా సర్‌ప్రైజు పాట నిజంగా అదిరిపోతుంది’ అని అన్నారు.