కొత్త లుక్‌లో...

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:26 AM

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాంత’. పీరియాడిక్‌ నేపథ్యంలో రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, ప్రశాంత్‌ పొట్లూరి..

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాంత’. పీరియాడిక్‌ నేపథ్యంలో రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ నిర్మిస్తున్నారు. సముద్రఖని ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. శనివారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘కాంత’ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. పోస్టర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న సముద్రఖని బ్యాక్‌సైడ్‌ లుక్‌ను చూపించారు. ఆయన భిన్నమైన ఆహార్యంతో తీక్షణంగా చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ‘కాంత’ నిర్మాణానాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఝును చంతర్‌, సినిమాటోగ్రఫీ: డానీ శాంచెజ్‌ లోపెజ్‌

Updated Date - Apr 27 , 2025 | 01:33 AM