Dulquer Salmaan: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్స్‌లో దుల్కర్ సినిమా.. టైటిల్ ఏంటంటే?
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:47 PM
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్‌లో మరో మూవీ ప్రారంభమైంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’గా వచ్చి, సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, అశ్వినిదత్‌కు చెందిన స్వప్న సినిమా సంయుక్తంగా సమర్పిస్తోన్న చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. ఇంతకీ ఈ మూవీకి టైటిల్ ఏంటంటే..
దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దుల్కర్ సల్మాన్‌కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కు ఆయన దగ్గరవుతున్నారు. రీసెంట్‌గా ఆయన నుండి వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్‌తో ఆయన తెలుగులో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ క్రేజీ డైరెక్టర్ పవన్ సాధినేనితో సినిమా చేస్తున్నట్లుగా ఇటీవల అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
Also Read- Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత
లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి పనిచేస్తుండటం విశేషం. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి వారు హాజరై సందడి చేశారు. కాగా, ఈ మూవీ ముహూర్తపు షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. నటీనటులు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. టాలెంటెడ్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్‌గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.