ఆ అనుభవాలతో పుస్తకం రాస్తాను

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:24 AM

‘‘28నిఇ’ సినిమా షూటింగ్‌ కోసం మేం చాలా కష్టపడ్డాం. చిత్రీకరణ కోసం రెండు సార్లు జార్జియా వెళ్లినా కొన్ని కారణాల వల్ల అధికారులు వెనక్కు పంపారు.,,

‘‘28నిఇ’ సినిమా షూటింగ్‌ కోసం మేం చాలా కష్టపడ్డాం. చిత్రీకరణ కోసం రెండు సార్లు జార్జియా వెళ్లినా కొన్ని కారణాల వల్ల అధికారులు వెనక్కు పంపారు. ఎన్నో సవాళ్లను దాటుకొని మూడో ప్రయత్నంలో అక్కడ చిత్రీకరణ పూర్తి చేశాం. అలా ఈ సినిమా అనుభవాలతో ఓ పుస్తకం రాయాలనుకుంటున్నాను’ అని డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ అన్నారు. ‘పొలిమేర’ చిత్రంతో దర్శకుడిగా చక్కని గుర్తింపు దక్కించుకున్న ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘28నిఇ’. నవీన్‌చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించారు. సాయి అభిషేక్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్‌ విశ్వనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘దర్శకుడిగా నాకు ఇది తొలి సినిమా. అయితే కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం అయింది. వైద్య విద్యార్థుల ప్రేమకథకు అతీంద్రియ శక్తులు ఎలాంటి అడ్డంకులు సృష్టించాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ‘పొలిమేర 3’ చేస్తున్నాను’ అని తెలిపారు.

Updated Date - Mar 30 , 2025 | 03:25 AM