సినిమాగా డొక్కా సీతమ్మ కథ

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:30 AM

అన్నపూర్ణగా, అన్నదాతగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప మహిళ డొక్కా సీతమ్మ. ఏ సమయంలోనైనా తన ఇంటికి ఎంతమంది వచ్చినా.. లేదు.. అనకుండా వారికి తనే స్వయంగా వండి వడ్డించిన ఆ మహాతల్లి...

అన్నపూర్ణగా, అన్నదాతగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప మహిళ డొక్కా సీతమ్మ. ఏ సమయంలోనైనా తన ఇంటికి ఎంతమంది వచ్చినా.. లేదు.. అనకుండా వారికి తనే స్వయంగా వండి వడ్డించిన ఆ మహాతల్లి జీవిత కథ ఇప్పుడు సినిమాగా వస్తోంది. అయితే చిత్ర నిర్మాణం ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌ విషయంలో వివాదం మొదలైంది. దాని గురించి రచయిత రామకృష్ణ మాట్లాడుతూ ‘సీతమ్మ కథను ‘అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ పేరుతో మొదట నాటకం రాశాను. 2016లోనే డొక్కా సీతమ్మ సినిమా స్ర్కిప్ట్‌ను తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్‌ చేశాను. ఎంతో కాలంగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చరిత్రను పరిశోధించి స్ర్కిప్ట్‌ తయారు చేశాను’ అని చెప్పారు. చరిత్ర సాకుతో తమ రచనను కాపీ కొడుతూ వేరొక సంస్థ కూడా సినిమా తీయడానికి ప్రయత్నించడంతో ఈ వివాదం కోర్టుకు చేరిందని నిర్మాత ప్రభాకర్‌ గౌడ్‌ చెప్పారు. కాపీ రైట్‌ యాక్ట్‌ కింద తమకు హక్కు ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉన్నందువల్ల తాము కోర్టు తీర్పును శిరోధార్యంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే వేరొక సంస్థ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అదే నిజంగా జరిగితే కోర్టు ధిక్కారం అవుతుందని ఆయన హెచ్చరించారు. కోర్టు తేల్చే వరకూ యథాతథ పరిస్థితిని కొనసాగించాలని కోరారు.

Updated Date - Mar 28 , 2025 | 02:30 AM