V.V. Vinayak: ఆరోగ్యంగానే ఉన్నానంటున్న వినాయక్!
ABN , Publish Date - Mar 03 , 2025 | 11:28 AM
దర్శకుడు వి.వి. వినాయక్ ఆరోగ్యం బాగాలేదంటూ వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇటీవల ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ (V. V. Vinayak) ను ఆయన నివాసంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్, సుకుమార్ (Sukumar) తో పాటు కొందరు దర్శకులు కలిశారు. పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అయితే ఆ ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో... అందులో ఉన్న వి.వి. వినాయక్ ను చూసి కొందరు... ఆయన అంత ఆరోగ్యం లేరనే భావనకు గురయ్యారు. అంతేకాదు... వినాయక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. తాజాగా ఈ విషయాన్ని వినాయక్ టీమ్ ఖండించింది.
దర్శకులు వినాయక్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలని తెలిపింది. అంతేకాదు... ఇలా అసత్య ప్రచారం చేస్తు్న్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించింది. గత కొంతకాలంగా వి.వి. వినాయక్ కొత్త సినిమాలు ఏవీ కమిట్ కాలేదు. చివరగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా 'ఛత్రపతి' (Chatrapathi) సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇది 2023 మే నెలలో విడుదలైంది.
Also Read: అవి డీప్‌ఫేక్ వీడియోలు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి