Director Trinadh Rao : కొంచెం తిని పెంచమ్మా... అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలి

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:07 AM

నటి అన్షూపై దర్శకుడు త్రినాధరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘‘మన్మథుడు’ సినిమా అప్పుడు హీరోయిన్‌ అన్షూ లడ్డూలాగా ఉండేవారు.

  • డైరెక్టర్‌ త్రినాధరావు వివాదాస్పద వ్యాఖ్యలు

టి అన్షూపై దర్శకుడు త్రినాధరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘‘మన్మథుడు’ సినిమా అప్పుడు హీరోయిన్‌ అన్షూ లడ్డూలాగా ఉండేవారు. ఆమెను చూడడానికే సినిమాకు వెళ్లేవాళ్లం. ఓ రేంజ్‌లో ఉండేవారు. కానీ అప్పటికంటే ఆమె కొంచెం సన్నబడ్డారు. తెలుగులో ఇది సరిపోదు. కొంచెం తిని పెంచమ్మా... అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలి అని చెప్పాను. ఫర్లేదు కొంచెం ఇంప్రూవ్‌ అయ్యారు. నెక్స్ట్‌ టైమ్‌కు బాగా ఇంప్రూవ్‌ అవుతారు’’ అని అన్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘మజాకా’ చిత్రం ప్రెస్‌మీట్‌లో త్రినాథరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను గౌరవించడం తెలియని ఇలాంటి వ్యక్తులను చిత్ర పరిశ్రమ బహిష్కరించాలని కోరుతున్నారు.

ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌, రీతూ వర్మ జంటగా నటిస్తున్నారు. అన్షూ, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాజేశ్‌ దండా, ఉమేశ్‌ కె.ఆర్‌ బన్సాల్‌ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ఆదివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఈ కథ వింటున్నప్పుడే రెండు గంటల పాటు నాన్‌ప్టా్‌పగా నవ్వా. ఇది కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరాన్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది వంద కోట్లు కొడుతుందని నమ్మకంతో ఉన్నా’’ అని నిర్మాత రాజేశ్‌ దండా చెప్పారు.

Updated Date - Jan 13 , 2025 | 04:08 AM