Director Harish Shankar: కంటెంట్‌ అదిరిపోయింది

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:59 AM

మలయాళ హిట్‌ ‘జింఖానా’ తెలుగు విడుదలకు సిద్ధమవుతోంది. హరీష్‌ శంకర్‌ ఈ సినిమా కంటెంట్‌ అద్భుతమని ప్రీ-рిలీజ్‌ ఈవెంట్‌లో ప్రశంసించారు

-హరీశ్‌ శంకర్‌

మలయాళంలో ఇటీవలె విడుదలై సూపర్‌హిట్‌ సాధించిన చిత్రం ‘జింఖానా’. ‘ప్రేమలు’ ఫేమ్‌ నస్లెన్‌ హీరోగా ఖలీద్‌ రెహ్మాన్‌ తెరకెక్కించారు. తెలుగులో శ్రీలక్ష్మీ నరహింస మూవీమేకర్స్‌ విడుదల చేస్తోంది. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కంటెంట్‌ అదిరిపోయింది. సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రేమలు’ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌ మర్చిపోలేను. ఈ సినిమానూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు ఖలీల్‌ రెహ్మాన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు అనుదీప్‌ కేవీ, సాగర్‌.కే.చంద్ర, సుజీత్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:59 AM