సరికొత్త ప్రేమకథను చూస్తారు
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:51 AM
కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘దిల్‌రుబా’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు విశ్వకరుణ్ శనివారం సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు. ‘వెస్ట్రన్ కల్చర్ నుంచి...
కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘దిల్‌రుబా’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు విశ్వకరుణ్ శనివారం సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు. ‘వెస్ట్రన్ కల్చర్ నుంచి మనం సార్, థాంక్స్ అనే మాటల్ని త్వరగా అలవాటు చేసుకున్నాం. తెలుగులో క్షమించమని అడగలేం కానీ సారీ అని మాత్రం ఈజీగా చెప్పేస్తాం. తన తప్పు లేనప్పుడు సారీ ఎందుకు చెప్పాలంటాడు మా హీరో. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోషించిన సిద్ధు పాత్ర తన వ్యక్తిత్వం విషయంలో కాంప్రమైజ్ కాదు. దీని వల్ల అతను జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా అధిగమించాడు అన్నదే చిత్ర కథ’ అని ఆయన చెప్పారు. ఇటీవల వచ్చిన ‘డ్రాగన్’ చిత్రానికీ, తమ సినిమాకు సంబంధం లేదని చెబుతూ ‘మా మూవీ ట్రీట్‌మెంట్ వేరుగా ఉంటుంది. ప్రేమకథలన్నీ ఒకటే. వాటిని తెరపై చూపించే విధానమే కొత్తగా ఉంటుంది. అటువంటి కొత్త తరహా ప్రేమకథను దిల్ రుబాలో చూస్తారు’ అని వివరించారు.
‘కిరణ్ అబ్బవరం ఇచ్చిన సపోర్ట్‌ను మరచిపోలేను. నా వర్క్‌లో ఆయన ఎప్పుడూ ఇన్‌వాల్వ్ కాలేదు. కెరీర్‌లో ఎదురు దెబ్బలు తిన్న ఎవరికైనా మంచి సినిమా చేయాలనే భయం ఉంటుంది. అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం. కిరణ్‌గారు చేసేది అదే. ‘క’ మూవీ సక్సెస్ తర్వాత మరింత గ్రాండ్‌గా ‘దిల్‌రుబా’ను తీసుకురావాలని ఆయన అనుకున్నారు. ఆ క్రమంలో కొన్ని మార్పులు చేశాం కానీ మూల కథలో ఎలాంటి మార్పు చేయలేదు’ అని వివరించారు.
Also Read: Radhika Apte: మెగా ఫోన్ పడుతున్న వివాదాస్పద నటి
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి