జపాన్‌లో దేవర

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:08 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. జపాన్‌లో ఈనెల 28న విడుదల చేస్తున్నారు...

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. జపాన్‌లో ఈనెల 28న విడుదల చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలసి ‘దేవర’ చూసేందుకు ఎన్టీఆర్‌ జపాన్‌ వెళ్లారు. భార్య ప్రణతితో కలసి ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ చిత్రంలో, బాలీవుడ్‌ సినిమా ‘వార్‌-2’లో నటిస్తున్నారు. ‘వార్‌-2’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవుతోంది.

Updated Date - Mar 24 , 2025 | 05:39 AM