మధురానుభూతినిస్తుంది
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:43 AM
‘దియా’ ఫేమ్ పృథ్వీ అంబర్ ప్రధానపాత్రలో సాయిరాజేశ్ మహదేవ్ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ ఉమ’. సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటించి నిర్మించారు. ఈ నెల 18న...
‘దియా’ ఫేమ్ పృథ్వీ అంబర్ ప్రధానపాత్రలో సాయిరాజేశ్ మహదేవ్ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ ఉమ’. సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటించి నిర్మించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలె విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్‌తో చేసిన విభిన్నమైన ప్రయత్నం ఇది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులకు మధురానుభూతినిచ్చే సినిమా ఇది’’ అని హీరో పృథ్వీ అంబర్ చెప్పారు.