రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:37 AM
ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ వార్నర్ తన ఆటతోనే కాదు, పలువురు టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ చేసిన వీడియోల ద్వారానూ తెలుగు ప్రేక్షకులకు...
ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ వార్నర్ తన ఆటతోనే కాదు, పలువురు టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ చేసిన వీడియోల ద్వారానూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. త్వరలో ఆయన తెలుగు తెరపై సందడి చేయనున్నారు. నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్‌హుడ్’లో వార్నర్ అతిథి పాత్ర పోషించారు. శనివారం వార్నర్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘రాబిన్‌హుడ్’లో వార్నర్‌ది అతిథి పాత్రే అయినప్పటికీ ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ, సోషల్ మీడియాలో ఉన్న ఫాలొయింగ్ ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి ప్లస్ కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు నవీన్ యర్నేని, వై. రవిశంకర్ చెప్పారు. ఈ నెల 28న విడుదల కానున్న ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో శ్రీలీల కథానాయిక. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషించారు. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకుడు.