Daksha Ott: ఓటీటీలో శరత్ బాబు తనయుడి 'దక్ష'
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:21 PM
నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ 'దక్ష' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
నటుడు శరత్ బాబు (Sarathbabu) తనయుడు ఆయుష్ తేజ్ (ayush teja) హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ 'దక్ష' (Daksha)ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఆయుష్, అఖిల్, అను, నక్షత్ర, రియా, రవి రెడ్డి, శోభన్ బోగరాజు, పవన్ కీలక పాత్రలు పోషించగా, శివ కాకు మాటలు అందించారు. లలిత్ కిరణ్ సంగీతం సమకూర్చారు. అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 25, 2023న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు Bcineet OTT, Hungama OTT, YouTube ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.
నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ "మాకు థియేటర్‌లో మంచి స్పందన లభించినట్లుగానే, ఇప్పుడు విడుదలైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'దక్ష' తప్పకుండా నచ్చుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండి, అధికారిక వేదికల ద్వారా మా సినిమాను వీక్షించండి. నిర్మాతలకు సహాయపడేలా ప్రతి రూపాయి విలువైనదని భావిస్తున్నాము. పైరసీకి పాల్పడిన కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే కంప్లయింట్ నమోదుచేశారు" అని తెలిపారు. దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ "మంచి కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్, వండర్‌ఫుల్ విజువల్స్ మా సినిమాకి ప్రధాన బలాలు" అని తెలిపారు.