Court: రూ. 50 కోట్ల పండగ!
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:58 PM
ప్రియదర్శి ప్రధాన పాత్రను పోషించిన 'కోర్ట్' సినిమా పది రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ ను మేకర్స్ నిర్వహించారు.
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది 'కోర్డ్' (Court) మూవీ. ఇవాళ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ లో సినిమాలను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో యాభై, వంద రోజుల రన్ అనేది అసాధ్యమైపోయింది. భారీ బడ్జెట్ సినిమాలను సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు కాగానే థియేటర్లలో ఎత్తివేస్తున్నారు. ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా 'కోర్ట్' మూవీ టీమ్ ఓ సరికొత్త సంప్రదాయానికి తెర లేపింది. ఈ సినిమా విడుదలైన పది రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సందర్భంగా 'కోర్ట్' మూవీ మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ ను నిర్వహించి, నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలను అందించారు. నేచురల్ స్టార్ నాని (Naani) చిత్ర యూనిట్ కి షీల్డ్స్ బహుకరించి యూనిట్ ను అభినందించారు. చిత్ర బృందం అంతా పాల్గొన్న ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం కోర్ట్ సినిమా అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా ఈ సినిమాకు సహ నిర్మాత.
Also Read: Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గా మెగాస్టార్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి