ఎవరు ఏమైనా అనుకోండి

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:22 AM

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఎల్‌2: ఎంపురాన్‌’. ఇటీవలె విడుదలైన ఈ సినిమాలోని పలు సన్నివేశాలు...

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఎల్‌2: ఎంపురాన్‌’. ఇటీవలె విడుదలైన ఈ సినిమాలోని పలు సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. 2002లో గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్లను ఈ సినిమాలో కీలక సన్నివేశాలుగా చూపించారనీ, ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయనీ పలువురు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ప్రదర్శనలను వెంటనే నిలిపివేయాలని వామపక్ష వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర రచయిత మురళీ గోపి స్పందించారు. ‘ఈ వివాదంపై నేను మౌనంగా ఉండాలనుకుంటున్నాను. వాళ్లకు నచ్చిన విధంగా అనుకోనివ్వండి. ఒక సినిమాని తమకు నచ్చిన విధంగా ఊహించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కాబట్టి వాళ్లకు నచ్చిన విధంగా ఊహించుకోనివ్వండి. నేను మాత్రం మౌనంగానే ఉంటాను’ అని మురళీ గోపి పేర్కొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 03:22 AM