ఇళయరాజా స్టూడియోలో సీఎం స్టాలిన్‌

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:34 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం భేటీ అయ్యారు. స్థానిక కోడంబాక్కంలోని ఇళయరాజా మ్యూజిక్‌ స్టూడియోకు వెళ్లిన స్టాలిన్‌...

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం భేటీ అయ్యారు. స్థానిక కోడంబాక్కంలోని ఇళయరాజా మ్యూజిక్‌ స్టూడియోకు వెళ్లిన స్టాలిన్‌.. ఆయనతో అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీన లండన్‌లో ఇళయరాజా సింఫనీ అరంగేట్రం జరుగనుండగా, ఆయన్ని ప్రత్యేకంగా అభినందించేందుకు స్టాలిన్‌ వెళ్లినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై సీఎం స్టాలిన్‌ కూడా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు. ‘ఆసియా ఖండంలోనే ఎవరూ చేయని ఘనతను ఈ నెల 8వ తేదీన లండన్‌లో సింఫనీ అరంగేంట్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు మన ప్రియమైన రాజా. తమిళనాడు గర్వించదగ్గ సంగీత విద్వాంసుణ్ణి అభినందించేందుకు స్వయంగా ఆయన స్టూడియోకు వెళ్ళాను. ఆయన స్వయంగా చేతితో రాసిన ‘వయలెంట్‌ సింఫనీ’ సంగీత నోట్స్‌ను నాకు చూపించారు. ప్రపంచ తమిళ ప్రజల సంగీత శ్వాసగా మారిన ఇళయరాజా తలపెట్టిన ఈ సింఫనీ అరంగేట్రం విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను’ అని స్టాలిన్‌ ఆకాంక్షించారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)


Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..

మిణుగురుల ప్రపంచంలోకి...

SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2025 | 02:34 AM