CM Pellaam : సందేశాత్మక చిత్రం

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:56 AM

ఈ పాట చూశాక చాలా భావోద్వోగానికి లోనయ్యాను. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు వస్తుంది’’ అని నటుడు అజయ్‌ అన్నారు.

అజయ్‌, ఇంద్రజ, సుమన్‌, జయసుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీఎమ్‌ పెళ్లాం’. గడ్డం రమణ దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి ప్రమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ ‘‘రాజకీయ నేపథ్యంతో కూడిన సందేశాత్మక చిత్రమిది’’ అని అన్నారు. ‘‘ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసే చిత్రమిది’’ అని దర్శకుడు రమణ గెడ్డం చెప్పారు. ‘‘ఈ పాట చూశాక చాలా భావోద్వోగానికి లోనయ్యాను. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు వస్తుంది’’ అని నటుడు అజయ్‌ అన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 03:56 AM