Robinhood: టిక్కెట్ రేట్ల పెంపుపై నిర్మాతల వివరణ
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:01 PM
నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ మార్చి 28న విడుదల కాబోతోంది. ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచినట్టు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దానిపై నిర్మాతలు వివరణ ఇచ్చారు.
నితిన్ (Nitin), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'రాబిన్ హుడ్' (Robinhood) మూవీ మార్చి 28న విడుదల కాబోతోంది. వెంకి కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మించింది. ఈ సినిమా టిక్కెట్ రేట్లను ఏపీలో పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సింగిల్ థియేటర్లలో యాభై రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లలో 75 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ కు జనాలు రావడమే తగ్గిపోయిన నేపథ్యంలో నితిన్ సినిమాకు సైతం టిక్కెట్ రేట్లు పెంచడం భావ్యం కాదంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా దాని కారణంగానే కావచ్చు... చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. టిక్కెట్ రేట్ల పెంపుపై వివరణ ఇచ్చింది.
'రాబిన్ హుడ్' సినిమా టిక్కెట్ రేట్లు పెంచిన మాట వాస్తవం కాదని చెబుతూనే, ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ప్రీమియర్ లొకేషన్ లోని కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన కేంద్రాలతో పాటు తెలంగాణ అంతటా మామూలు రేట్లకే సినిమాను ప్రదర్శిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రేక్షకులకు సరసమైన ధరకు వినోదాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని, అందుకనే రెగ్యులర్ టిక్కెట్ ప్రైస్ కే సినిమాను చూపిస్తున్నామని ఈ ప్రకటనలో వివరణ ఇచ్చింది.
Also Read: Pawan Kalyan: తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఏమన్నారంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి