శ్రీలీలకు చిరంజీవి కానుక

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:42 AM

నటి శ్రీలీలకు చిరంజీవి ఓ విలువైన కానుకను బహూకరించారు. చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’...

నటి శ్రీలీలకు చిరంజీవి ఓ విలువైన కానుకను బహూకరించారు. చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా సెట్స్‌లో శ్రీలీల సందడి చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా దుర్గాదేవి ప్రతిమ ఉన్న ఓ వెండి శంఖాన్ని ఆమెకు కానుకగా ఇచ్చారు చిరంజీవి. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు శ్రీలీల. భారీ బడ్జెట్‌తో వంశీ, విక్రమ్‌, ప్రమోద్‌ ‘విశ్వంభర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలు.

Updated Date - Mar 10 , 2025 | 04:42 AM