విశ్వంభర నుంచి రామ రామ

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:20 AM

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం‘విశ్వంభర.’ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి...

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం‘విశ్వంభర.’ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం నుంచి తొలి గీతం ‘రామ రామ’ను ఈ శనివారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. పోస్టర్‌లో చిరంజీవి చుట్టూ పిల్లలు హనుమంతుడి వేషధారణలో ఉన్నారు. అలాగే బ్యాక్‌డ్రాప్‌లో రాముడి విగ్రహం ఉంది. ‘రామ రామ’ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారు. కాగా, ఈ చిత్రంలో త్రిష కృష్ణన్‌, ఆశికా రంగనాథ్‌ హీరోయిన్లు. కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మా బిడ్డ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడిన విషయం తెలిసిన వెంటనే చిరంజీవి, ఆయన సతీమణి సురేఖతో కలసి అక్కడికి వెళ్లారు.మార్క్‌ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘మా బిడ్డ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్లీ ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్‌ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. మా కుటుంబానికి అండగా నిలబడి, ఆ బిడ్డకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ నా తరపున, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 06:20 AM