‘చిరు’నవ్వుల ‘పండగ’ బొమ్మ!

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:51 AM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తను రూపొందించే చిత్రానికి సంబంధించిన లేటేస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. అద్భుతమైన కామెడీ టైమింగ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరొందిన ఆయన...

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తను రూపొందించే చిత్రానికి సంబంధించిన లేటేస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. అద్భుతమైన కామెడీ టైమింగ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరొందిన ఆయన ఈ సారి కూడా వినోదభరిత ఇతివృత్తాన్నే ఎన్నుకున్నారు. కామెడీ, ఎమోషన్‌, యాక్షన్‌ అంశాలు కలగలిసే ఈ చిత్రంలో తను ఇంతవరకూ చేయని పాత్రను చిరంజీవి పోషిస్తున్నారు. తన అసలు పేరు.తో, శివశంకర వరప్రసాద్‌ గానే చిరంజీవి ఇందులో కనిపించనుండడం విశేషం.ఈ సినిమా స్ర్కిప్ట్‌ సిద్ధం కావడంతో చిరంజీవికి ఫైనల్‌ నేరేషన్‌ ఇచ్చారు అనిల్‌. ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక షూటింగ్‌ ప్రారంభించడమే తరువాయి. అదే విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘స్ర్కిప్ట్‌ వినిపించడం పూర్తయింది.. గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. చిరంజీవిగారికి నా కథలో పాత్ర ‘శంకర్‌ వరప్రసాద్‌ని పరిచయం చేశా. ఆయనకు ఆ రోల్‌ బాగా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. మంచి ముహూర్తంతో.. ‘చిరు’నవ్వుల ‘పండగ’ బొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు అనిల్‌ రావిపూడి. సాహు గారపాటి నిర్మించే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అంటున్నారు.

Updated Date - Mar 27 , 2025 | 03:51 AM