Game Changer: ‘గేమ్ చేంజర్’పై చిరంజీవి, ఉపాసనల స్పందనిదే..
ABN , Publish Date - Jan 10 , 2025 | 10:43 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘గేమ్ చేంజర్’ సినిమా థియేటర్లలో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాకు వస్తున్న టాక్‌తో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారు ఏమన్నారంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాకు వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు.
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
‘‘అప్పన్న పాత్రలోనూ మరియు వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే నిజాయితీగల ఐఏఎస్ అధికారి పాత్రలో రామ్ నందన్‌గా రామ్ చరణ్ నటన ప్రశంసలు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలో నటించిన ఎస్ జె సూర్య, అంజలి, కియారా అద్వాణీ, నిర్మాత దిల్ రాజులకు అభినందనలు తెలుపుతున్నాను. డైరెక్టర్ శంకర్, ఒక మంచి పొలిటికల్ డ్రామాకు ఎలాంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు కావాలో అలాంటివారిని తీసుకొని ఈ సినిమాను రూపొందించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. ‘నా ప్రియమైన భర్త రామ్ చరణ్‌కు అభినందనలు. నిజంగా మీరు అన్ని విధాలుగా గేమ్ చేంజర్. లవ్ యూ’ అని ఉపాసన ట్వీట్ విమర్శకుల అభిప్రాయాలతో ఉన్న పోస్టర్‌ని షేర్ చేశారు. ప్రస్తుతం చిరు, ఉపాసనల పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.