'చైనా పీస్' హీరో లుక్ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:10 PM
నిహాల్ కోధాటి(Nihaal Kodati), సూర్య శ్రీనివాస్ కథానాయకులుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. ఇందులో నిహాల్ వాలి పాత్రలో కనిపించనున్నారు.
నిహాల్ కోధాటి(Nihaal Kodati), సూర్య శ్రీనివాస్ కథానాయకులుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. ఇందులో నిహాల్ వాలి పాత్రలో కనిపించనున్నారు. మంగళవారం చిత్ర బృందం హీరో లుక్ ను విడుదల చేశారు. నిహాల్ ని ఇంటెన్స్ లుక్ లో ప్రజెంట్ చేసి ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి సురేష్ రగుతు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందిస్తుండగా మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ALSO READ: Mega 157: మెగా 157 గ్యాంగ్ ఇదే..
Tollywood: మూడు నెలల్లో మిశ్రమ స్పందన
Kollywood: తమిళ దర్శకులకు ఏమైంది...