Kadali Routhu: సవాల్‌ను స్వీకరిస్తూ సాగిపోవాలి
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:23 AM
ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు. ఎవరి ప్రతిభ వారికి రక్ష. సత్తానే ముందుకు నడిపిస్తుంది.
ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు. ఎవరి ప్రతిభ వారికి రక్ష. సత్తానే ముందుకు నడిపిస్తుంది. ప్రతి సవాల్‌ను స్వీకరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఎవరైనా మనల్ని ఏదైనా పని చేయలేవు అని అంటే, కచ్చితంగా చేసి చూపించాలి. మా నాన్న రౌతు రవి రచయిత. ఆయన ద్వారానే నాకు రచనపై మక్కువ ఏర్పడింది. నిత్యామీనన్ నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్‌తో పాటు కొన్ని సినిమాలకు పాటలన్నీ నేనే రాశాను. ఇప్పటివరకూ 70 సినిమాల్లో 200 పాటలు రాశాను. చిన్నప్పటి నుంచి మణిశర్మ అంటే చాలా ఇష్టం. నేను రాసిన ఓ పాటను ఆయన మెచ్చుకోవడం నాకు దక్కిన అతి పెద్ద ప్రశంస. సాయిదుర్గాతేజ్, స్వాతి నటించిన ‘సత్య’ అనే లఘు చిత్రానికి సంభాషణలు రాశా. ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలకు పాటలు రాస్తున్నా. భవిష్యత్తులో దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఉంది.
- కడలి రౌతు (గీత రచయిత్రి)