ఉత్కంఠకు గురిచేసే రాత్రి

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:24 AM

లవ్‌, సెంటిమెంట్‌, హారర్‌, సస్పెన్స్‌ అంశాల మేళవింపుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్లైండ్‌ స్పాట్‌’. నవీన్‌చంద్ర కథానాయకుడిగా రాకేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు...

లవ్‌, సెంటిమెంట్‌, హారర్‌, సస్పెన్స్‌ అంశాల మేళవింపుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్లైండ్‌ స్పాట్‌’. నవీన్‌చంద్ర కథానాయకుడిగా రాకేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రామకృష్ణ వీరపనేని నిర్మించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. క్రైమ్‌, అపరాధపరిశోధనాత్మక కథనంతో రూపొందిన చిత్రమిదని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా కథ ఉంటుంది. ఒక రాత్రిలో జరిగే సంఘటనలతో కొందరి జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. నటుడిగా నాకు కొత్త అనుభూతిని ఇచ్చిన చిత్రమిది’ అన్నారు. రాశీ సింగ్‌ మాట్లాడుతూ ‘కథలో నాది కీలకపాత్ర. నాకు ఇష్టమైన జానర్‌లో రూపొందిన చిత్రమిది’ అని చెప్పారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అని దర్శకుడు చెప్పారు.

Updated Date - Apr 19 , 2025 | 03:24 AM