భారతీరాజా కుమారుడు మనోజ్ ఇకలేరు
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:26 AM
తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్(48) హఠాన్మరణం చెందారు. కొన్ని నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన చేయించుకున్నారు, మంగళవారం సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ కావడంతో...
కార్డియాక్ అరె్‌స్టతో హఠాన్మరణం
తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్(48) హఠాన్మరణం చెందారు. కొన్ని నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన చేయించుకున్నారు, మంగళవారం సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ కావడంతో చెట్‌పట్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1999లో ‘తాజ్‌మహల్’ అనే చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘సముద్రం’, ‘కడల్ పూక్కల్’, ‘సముద్రం, ‘అల్లి అర్జున’, ‘వరుషమెల్లాం వసంతం’, ‘ఈర నిరమ్’ వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. 2023లో ‘మార్గళి తింగల్’ అనే సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మలయాళ నటి అశ్వతి అలియాస్ నందనను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు అశ్రిత, మదివదని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, మనోజ్ మరణవార్త తెలియగానే కోలీవుడ్ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. మనోజ్ ఆకస్మిక మృతిపట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సంగీత దర్శకుడు ఇళయరాజా సహా తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)