Bellamkonda Sreenivas: ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో వస్తున్నా..
ABN , Publish Date - Jan 20 , 2025 | 09:21 PM
ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతోనే రావాలని బలంగా నిర్ణయించుకునే వస్తున్నానని అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయనతో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా.. విజయ్ కనకమేడల రూపొందిస్తోన్న చిత్రం ‘భైరవం’ ఈ చిత్ర టీజర్‌ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొని, చిత్ర విశేషాలను తెలియజేసింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ టీజర్ లాంచ్ వేడుకలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘మీ అందరిని చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతోనే రావాలని బలంగా నిర్ణయించుకునే వస్తున్నాం. శ్రీధర్ గారు ఈ కథకు నాంది పలికారు. జయ జానకి నాయక కు మించి ఒక సినిమా చేయాలని నిర్మాత శ్రీధర్ గారితో చెప్పాను. అలా మంచి కథ కోసం వేట మొదలైంది. అలా భైరవం లాంటి మంచి కథ దొరికింది. ఆ తర్వాత మా పోరాటం మొదలైంది. ఈ సినిమాకి డైరెక్టర్ విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఆయన టాప్ డైరెక్టర్ అవుతారు.
Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం
ఈ కథ పూర్తయిన తర్వాత ఒక రాముడు, లక్ష్మణుడు కావాల్సి వచ్చింది. ఈ సినిమాని రోహిత్ గారు ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్. ఇది కథకు రోహిత్ గారు, మనోజ్ గారు తప్పితే ఎవరు చేయలేరనే అంతా గొప్పగా చేశారు. వాళ్లతో వర్క్ చేసే అవకాశం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. ఇద్దరు మంచి బ్రదర్స్‌ని ఈ సినిమాకు నాకు ఇచ్చింది. సెట్స్‌లో కూడా చాలా బాగుండేది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ సినిమా చేశాం. తప్పకుండా మీరు ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ ఇలా అందరూ టెక్నీషియన్స్‌కీ థాంక్యూ. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మమ్మల్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. అతిది, ఆనంది, దివ్య అద్భుతంగా నటించారు. సినిమాని ప్రేమించే మీ అందరికీ థాంక్యూ వెరీ మచ్. కచ్చితంగా ఈ సినిమా మాకు, మీకు ఒక మెమరబుల్ మూవీ అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.