అందమైన ప్రేమకథ
ABN , Publish Date - Mar 20 , 2025 | 02:30 AM
వినయ్‌కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కాలమేగా కరిగింది. సింగార మోహన్ దర్శకత్వంలో...
వినయ్‌కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలమేగా కరిగింది’. సింగార మోహన్ దర్శకత్వంలో మరే శివశంకర్ నిర్మించారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ శుక్రవారం విడుదలవుతోందీ చిత్రం. తాజాగా, నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో వినయ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘కలహాలే లేని అందమైన ప్రేమకథ ఇది’’ అని అన్నారు. ‘‘ఈ కవితాత్మక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి విజయం సాధిస్తుంది’’ అని దర్శకుడు శింగార మోహన్ చెప్పారు. ‘‘ఇదో స్వచ్ఛమైన ప్రేమకథ. సినిమా అద్భుతంగా ఉంటుంది’’ అని నిర్మాత మరే శివశంకర్ తెలిపారు.