NBK: గోపీచంద్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బాలయ్య

ABN , Publish Date - Mar 26 , 2025 | 05:45 PM

బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి' లాంటి సూపర్ హిట్ మూవీని తీసిన మలినేని గోపీచంద్... 'జాట్' తెలుగు వర్షన్ లో నటించమని బాలకృష్ణను కోరాడట. అయితే ఆయన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

తెలుగు దర్శకులు హిందీ సినిమాలను డైరెక్ట్ చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈ తరంలో చాలామంది యువ దర్శకులు తెలుగులో తాము డైరెక్ట్ చేసిన చిత్రాలనే హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy), సంకల్ప్ రెడ్డి (Sankalp reddy), క్రిష్ (Krish) వంటి వారు డైరెక్ట్ హిందీ చిత్రాలను తీసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మొదటిసారి బాలీవుడ్ బాట పట్టాడు. సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా అతను తెరకెక్కించిన 'జాట్' (Jaat) మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇది గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన తెలుగు సినిమాకు రీ-మేక్ అనే వార్తలు ఆ మధ్య వచ్చాయి కానీ అలాంటిదేమీ లేదని, ఇది డైరెక్ట్ హిందీ మూవీ అని మేకర్స్ స్పష్టం చేశారు.


ఇదిలా ఉంటే ఇప్పటికే బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి' (Veerasimha Reddy) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గోపీచంద్ మలినేని... బాలకృష్ణను 'జాట్' తెలుగు వర్షన్ లో నటించాల్సింది కోరారట. బాలకృష్ణ అంగీకరిస్తే... హిందీలో సన్నీ డియోల్ తోనూ, తెలుగులో బాలకృష్ణ తోనూ ఆ పాత్ర చేయించాలనుకున్నాడట. అయితే ఇప్పటికే 'అఖండ -2' (Akanda -2) చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బాలకృష్ణ గోపీచంద్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. గోపీచంద్ ప్రపోజల్ నచ్చి 'జాట్' ను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్స్ తమ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ ఎప్పుడైతే బాలకృష్ణ నో చెప్పారో అప్పుడే... ఈ సినిమాను హిందీలో మాత్రమే తీసి తెలుగులో డబ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చేశారు. ఆ రకంగా ఏప్రిల్ 10న 'జాట్' సినిమాను హిందీతో పాటు తెలుగు, ఇతర ప్రధాన భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. అయితే... 'జాట్' మూవీ ట్రైలర్ ను చూసిన నెటిజన్స్... ఇదేదో బాలకృష్ణ సినిమాలోని కోర్ పాయింట్ ను తీసుకుని తెరకెక్కించినట్టుందని కామెంట్ చేస్తున్నారు.

Also Read: Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గా మెగాస్టార్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 26 , 2025 | 08:10 PM