Vaishnavi chaitanya: దీపం ఉండగానే...
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:30 PM
'బేబీ'తో హీరోయిన్ గా ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య కు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకే ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్డమ్ తెచ్చుకుంది అందాల భామ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ మంచి టాలెంట్ ఉందనే పేరు సంపాదించుకున్న ఈ చిన్నది కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. ''గీత గోవిందం, అల వైకుంఠపురములో, టక్ జగదీష్'' సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. 'బేబీ' (Baby) తో హీరోయిన్ గా మారిపోయి సెన్సేషన్ సృష్టించింది. తన అద్భుతమైన యాక్టింగ్‌తో కుర్రకారు గుండెల్లో గునపాలు దించేసింది. యాక్టింగ్ లో కుమ్మేస్తుండటంతో వైష్ణవికి క్రేజీ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి.
'బేబీ' బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన 'లవ్ మీ' (Love me) మూవీ ఫ్లాప్ అయినా... ఈ బ్యూటీకి మాత్రం కంటిన్యూగా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. సినిమాల ఎంపిక చేసుకునే విషయంలో వైష్ణవి కొంచెం ఆచితూచి వ్యవహరించడంతో పాటు తన క్రేజ్ కు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రెజెంట్ 'జాక్' (Jack) మూవీతో పాటు ఆనంద్ దేవకొండతో ఓ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో సిద్ధు, వైష్ణవి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ఆనంద్ దేవరకొండతో చేస్తున్న మూవీ 90s వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా రాబోతోంది. ఇవే కాక క్రేజీ ఆఫర్లు వచ్చేస్తున్న తరుణంలో తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడిందట ఈ బ్యూటీ!
'బేబీ' తెచ్చిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని నెక్ట్స్ చేయబోయే సినిమాలకు కోటి వరకు డిమాండ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పైగా సినిమా సినిమాకు గ్యాప్ లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తోంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యూటీ కాల్షిట్ల కోసం మేకర్స్ క్యూ కడుతున్నారట. రీసెంట్ గా ఓ యంగ్ ప్రొడ్యూసర్ బ్యూటీ అడిగినంత ఇచ్చేందుకు ముందుకు వచ్చేశాడట. టాలీవుడ్ ఇండస్ట్రీలో వైష్ణవి హాట్ కేక్ లా మారిందని... ఫ్యూచర్ లో తన లేట్స్ దొరకడం కష్టమయ్యే ఛాన్స్ ఉండటంతో ముందే భారీ పారితోషికం ఇచ్చి, బల్క్ డేట్స్ ను బుక్ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. సైలెంట్ గానే క్రేజీ ప్రాజెక్టులు కొట్టేస్తూ సెన్సేషన్ గా మారుతోంది వైష్ణవి చైతన్య!
Also Read: Subham Teaser: సమంత ‘శుభం’.. శోభనం గదిలో ఏమైంది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి