Ram Prasad: సెన్సార్ పూర్తి చేసుకున్న W/O అనిర్వేష్

ABN , Publish Date - Feb 18 , 2025 | 10:36 AM

జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి నటించిన  చిత్రం 'W/O అనిర్వేష్'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది.  గంగ సప్త శిఖర దర్శకత్వం వహించిన చిత్రమిది. 


జబర్దస్త్ రాంప్రసాద్9Auto Ram Prasad), జెమినీ సురేష్, కిరీటి నటించిన  చిత్రం 'W/O అనిర్వేష్' (W/O Anirvesh). సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది.  గంగ సప్త శిఖర దర్శకత్వం వహించిన చిత్రమిది.  సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి  ఇతర పాత్రధారులు. "జబర్దస్త్ రాంప్రసాద్ హీరోగా ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్  స్టోరీని ఎంగేజింగా ప్రేక్షకులకు చూపించబోతున్నాం.  సంగీత దర్శకుడు షణ్ముఖ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. వి ఆర్ కె నాయుడు కెమెరామెన్ గా తన ప్రతిభను చూపించారు. అతి త్వరలో సినిమాను విడుదల చేస్తాం. కచ్చితంగా విజయం సాధిస్తుంది" అని  చిత్ర బృందం అన్నారు.  

Updated Date - Feb 18 , 2025 | 03:29 PM