ఘనవిజయం సాధిస్తుంది
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:02 AM
సునీల్ బలుసు, అశోక్‌వర్ధన్ ముప్పా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించారు. ఈనెల 18న...
సునీల్ బలుసు, అశోక్‌వర్ధన్ ముప్పా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించారు. ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా సునీల్ బలుసు, అశోక్‌వర్ధన్ ముప్పా మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇది కల్యాణ్‌రామ్ బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కథ. ఆయన కోసమే ప్రత్యేకంగా మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా తెరకెక్కించిన సినిమా. హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే పోరాట ఘట్టాలు ఈ సినిమాకు ప్రధానాకర్షణ. ఫైనల్ అవుట్‌పుట్ చూశాం, సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకముంది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడలేదు. పెట్టిన ప్రతీ రూపాయి తిరిగివస్తుందన్న నమ్మకం ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ క్టైమాక్స్ ఇదే’’ అని సునీల్ బలుసు అన్నారు. ‘‘విజయశాంతి రోల్ ఈ సినిమాకు చాలా కీలకం. ఆమెకూ హీరోకూ మధ్య వచ్చే సన్నివేశాలన్ని అద్భుతంగా వచ్చాయి. ప్రదీప్ చాలా ప్రతిభావంతుడు. ఆయన మేకింగ్, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్‌ప్రసాద్ విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. సెకండాఫ్ చాలా రేసీగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా ప్రేక్షకులు చూపు తిప్పరు’’ అని అశోక్‌వర్ధన్ ముప్పా చెప్పారు.