Cinema Trends: సినిమాల స్టైల్ మారింది..
ABN , Publish Date - Jan 15 , 2025 | 02:20 PM
Cinema Trends: జినీకాంత్ కంటే అనిరుధ్ , నెల్సన్ లే ఎక్కువగా కనిపించారు. వారే స్వయనా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా రజినీకాంత్, అనిరుధ్ కాంబో కున్న క్రేజ్ దృష్ట్యా ..
ప్రస్తుతం సినిమాలు తీసే విధానంలోనే కాదు.. ప్రమోషన్స్, అనౌన్స్ మెంట్స్, అప్డేట్స్ అన్నిటిలోను మార్పు, కొత్తదనం వచ్చేసింది. గతంలో సినిమా అనౌన్స్ మెంట్ మొదలు అప్డేట్స్ వరకు సినిమా హీరో హీరోయిన్స్ తోనే మేకర్స్ చిత్రీకరించి వదలేవారు. కానీ.. ఇప్పుడు టెక్నిషియన్స్ హైలెట్ గా కొన్ని సినిమాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. చిన్న సినిమాల మొదలు సూపర్ స్టార్స్ వరకు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ప్రొమోషన్స్ ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడాయననే ఫాలో అవుతున్నాడు తమిళ దర్శకుడు నెల్సన్. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నెల్సన్.. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ సీక్వెల్‌పై కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉండదనే అంతా అనుకున్నారు. కానీ పొంగల్‌ని పురస్కరించుకుని.. ‘జైలర్ 2’ అనౌన్స్‌మెంట్ టీజర్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
ఈ టీజర్‌లో ఉన్న విశేషం ఏమిటంటే.. ఇందులో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా నటించారు. ఓ యాక్షన్ బ్లాక్‌తో టీజర్‌ని కట్ చేశారు. ‘జైలర్’లో ఎలా అయితే రజనీకాంత్ కనిపించారో.. ఇందులోనూ సేమ్ టు సేమ్ కనిపించి నెల్సన్, అనిరుధ్‌లను భయపెట్టేశారు. ఈ వీడియోలో రజినీకాంత్ కంటే అనిరుధ్ , నెల్సన్ లే ఎక్కువగా కనిపించారు. వారే స్వయనా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది.ప్రత్యేకంగా రజినీకాంత్, అనిరుధ్ కాంబో కున్న క్రేజ్ దృష్ట్యా .. అనిరుధ్ ను తెరవెనుకే కాకుండా తెరముందు కూడా వాడుకుంటున్నారు.వెట్టయాన్ లో అనిరుధ్ ఓ పాట లో కూడా కనిపించాడు.