చిరంజీవి చిత్రానికి శ్రీకారం
ABN , Publish Date - Mar 31 , 2025 | 02:24 AM
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా 157’ - వర్కింగ్ టైటిల్) సెట్స్‌పైకి వెళ్లింది. ఉగాది సందర్భంగా ఆదివారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలు పెట్టారు...
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా 157’ - వర్కింగ్ టైటిల్) సెట్స్‌పైకి వెళ్లింది. ఉగాది సందర్భంగా ఆదివారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలు పెట్టారు. ముహూర్తపు షాట్‌కు వెంకటేశ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్‌రాజు, శిరీష్ స్ర్కిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ‘విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించి విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ఇది. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో షైన్ స్ర్కీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేన ర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘మెగా 157’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ విడుదలకు సిద్ధమవుతోంది.